జనసేన పార్టీకి ఈసారి ఒక అవకాశం ఇవ్వండి: బత్తుల

  • జనం కోసం జనసేన మహాపాదయాత్ర 43వ రోజు

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, నిడిగట్ల గ్రామంలో మంగళవారం జరిగిన జనం కోసం జనసేన మహాపాదయాత్ర 43వ రోజు.. గ్రామ ప్రజల ఆదరాభిమానాలతో ఉత్సాహంగా కొనసాగింది, ఈ పాదయాత్ర నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రెటరీ మేడిశెట్టి శివరాం ఆధ్వర్యంలో జరిగిన ఈ పాదయాత్ర గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ, ప్రతి గడప ఎక్కుతూ, ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, జనసేన కరపపత్రాలు పంచుతూ, జనశ్రేణులు మధ్య కోలాహలంగా జరిగింది..? ఈ సందర్భంగా మీడియాతో బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. అస్తవ్యస్తంగా తయారైన ఈ రాక్షస పాలన నుండి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కాపాడాలని.. సామాన్యునికి రాజ్యాధికారం దక్కి.. ఉన్నత సమాజాన్ని నిర్మించాలని, తన విలువైన జీవితాన్ని వదిలేసి… మార్పు కోసం పరితపిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఈసారి ఒక అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రం మళ్ళీ గాడిన పడుతుందని, లేదంటే కుక్కలు చింపిన విస్తరిలా తయారయ్యి, రాష్ట్రంలో దుర్భరమైన పరిస్థితులు దాపరిస్తాయని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అన్నారు.. పాదయాత్రలో గ్రామ ప్రజలు బ్రహ్మరథం పడుతూ, పెద్ద ఎత్తున హారతులు ఇస్తూ… తీన్మార్ డప్పులతో, బాణసంచా కాల్చుతూ.. స్వచ్ఛందంగా ఈసారి ప్రజలే జనసేన పార్టీ రావాలని కోరుకుంటున్నామన్నారు.. ఈ సందర్భంగా గ్రామంలోని వైసీపీ కీలక నేతలు బత్తుల వెంకటలక్ష్మి, మేడిశెట్టి శివరాం ల సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు, వారందరికీ జనసేన కండువా కప్పి జనసేన పార్టీలో సాదరంగా ఆహ్వానించారు.. శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, తూర్పుగోనుగూడెం సర్పంచ్ గళ్లా రంగా, అడ్డాల శ్రీను, వేగిశెట్టి రాజు, బోయిడి వెంకటేష్, గంగిశెట్టి రాజేంద్ర, పాలచర్ల రాజారావు, చిట్టిప్రోలు సత్తిబాబు, బత్తుల గోపాలకృష్ణ, తోట అనిల్ వాసు, ముత్యాల మహేష్, సీనియర్ నేతలు కామిశెట్టి విష్ణు, వీరమహిళ కామిశెట్టి హిమశ్రీ, రామిశెట్టి సతీష్, నిడిగట్ల జనసేన యూత్, జనసేన నాయకులు, జనసైనికులు, నిడిగట్ల గ్రామప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.