జనసైనికుల సంక్షేమమే జనసేన అధినేత ధ్యేయం: త్యాడ రామకృష్ణారావు

విజయనగరం, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) స్థానిక అయ్యన్నపేట జంక్షన్ వద్ద బుధవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాజకీయ చరిత్రలోనే కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచించి పార్టీ క్రియాశీలక సభ్యులకు జీవితభీమా సౌకర్యాన్ని కల్పించారని, ఈ అవకాశాన్ని ప్రతీ జనసైనికులు, వీరమహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేవలం ఐదు వందల రూపాయలు పెట్టి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నచో ఐదు లక్షలు జీవిత భీమా, అలాగే ఏభైవేలు వరకు హాస్పిటల్ ఖర్చులు నిమిత్తం ప్రమాదభీమా పార్టీ కల్పిస్తుందని అన్నారు. విజయనగరం అసెంబ్లీ ఇంచార్జ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ఆదేశాల మేరకు పెట్టిన క్రియాశీలక సభ్యత్వ శిబిరానికి మంచి స్పందన లభించిందని, ఇదేస్ఫూర్తితో మరన్ని శిబిరాలను పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. పలువురు సభ్యత్వాలు తీసుకున్న ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు మజ్జి శివశంకర్, డాక్టర్ మురళి మోహన్, చెల్లూరి ముత్యాల నాయుడు, లోపింటి కళ్యాణ్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, అబ్బు, సత్యనారాయణ, రాంబాబు, శంకర్ పాల్గొన్నారు.