రామకుప్పం మండల ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకం

  • కుప్పం జనసేన పార్టీ నిరవధిక నిరసన ఫలితం

చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండల ఆదర్శ పాఠశాలలోని 485 విద్యార్థులకు గాను ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేని కారణంగా మరియు త్రాగుటకు, వాడుకకు నీటి సదుపాయం లేని కారణంగా
1) నిబంధనల ప్రకారం కనీసం 13 మందినయినా నియమించాలని…
2) త్రాగుటకు, వాడుటకు నీటి సదుపాయం కల్పించాలనే డిమాండ్లతో రామకుప్పం మండల ఆదర్శ పాఠశాల యందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరిపిన నిరవధిక నిరసన కార్యక్రమానికి ఫలితంగా 13 మంది ఉపాధ్యాయులను యుద్ధప్రాతిపదికన నియమించి, నీటి సదుపాయాన్ని కల్పించిన యం.ఈ.ఓ మహబూబ్ బాషా మరియు డి.ఈ.ఓ పురుషోత్తం లకు కుప్పం జనసేన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన జనసేన నాయకులు రామమూర్తి, వేణు, వామనమూర్తి, వినోద్ కుమార్, చంద్రు, హరీష్, శ్రీకాంత్, కె.నవీన్, పవన్, అంజిప్రసాద్, భాస్కర్, సోము శేఖర్ నాయక్, అజిత్, మోహన్, ఆర్.నవీన్, హరీష్, సురేష్, ఈశ్వర్, మున్నప్ప, గిరి, సుధాకర్ నాయక్, నవీన్ నాయక్, అరుణ్, హరి, సంపత్, అమీర్, గణేష్, శాంతారామ్, హంసాగిరి, కిషోర్, కుప్పం ప్రజావేదిక సభ్యులు మునిరాజు, శివశంకర్, బాస్ నాయకులు బాలచంద్ర బాబు, నవీన్, గోవిందప్ప, బాలు, విక్రమ్, చలపతి, దేవరాజు, ప్రకాష్, రవీంద్ర, గోవిందప్ప, రమేష్, కిరణ్, మహేష్, ఇందుకు సహకరించిన రామకుప్పం ఎస్.ఐ ఉమామహేశ్వర్ రెడ్డి, పి.సి అన్బు మరియు మీడియా ప్రతినిధులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు.