ప్రజలు జగన్ ను నమ్మే రోజులు లేవు

  • అప్పుడెట్ల మాట్లాడుతుండే జగన్..?
  • ఇప్పుడెట్ల మాట్లాడుతుంన్డు జగన్..?
  • నెల్లూరు సిటీ, వెంకటేశ్వర పురం, జనసేన పార్టీ పతాకా విష్కరణలో గునుకుల కిషోర్

నెల్లూరు: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరద బాధితులకు కనీసం 5000 రూపాయలు ఇవ్వాలని సూచించిన జగన్ గారు ఇప్పుడు కేవలం 1000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం చూస్తుంటే ప్రతిపక్ష నాయకుడిగా ఒకలా అధికార పార్టీ నాయకులు ఒకలా ఉన్నాడు జగన్ అనిపిస్తుంది.. ఇక ప్రజలు నమ్మే రోజులు లేవు. జనసేన పార్టీ నెల్లూరు సిటీ నిర్దేశకులు జాతీయ మీడియా ప్రతినిధి, క్రమశిక్షణా కమిటీ వేములపాటి అజయ్ సూచనలు వెంకటేశ్వర్లు 53, 54 డివిజన్ల మధ్య సెంటర్ లో జనసేన నాయకులు కుక్క ప్రభాకర్ చే పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగస్తుల పిఆర్సి విషయంలో కానీ, విద్యుత్ చార్జీలు తగ్గించే విషయంలో కానీయువత ఉపాధి కి జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, అనేక విషయాల మాట ఇచ్చి తప్పిన పరిస్థితి. అప్పుడెట్టుంది నెల్లూరు ఇప్పుడెట్లుంది అని చూస్తే… అభివృద్ధికి దూరంగా యధా స్థానంలో ఉందనిపిస్తుంది. నెల్లూరు సిటీలో నాలుగు సంవత్సరాల ముందర 365 రోజుల్లో పూర్తి చేస్తానని కౌంట్ డౌన్ పెట్టి ముత్తుకూరు సర్కిల్ లో ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ ఏట్టకేలకు నాలుగు సంవత్సరాలకి పూర్తయినప్పటికీ…కింద రోడ్డు అంతా చిద్రమై ట్రాఫిక్ కి ఇబ్బంది కరంగా ఉంది. అదే విధంగా నెల్లూరు రూరల్ లో గ్రామాలకు అన్నిటికి ముఖ్యమార్గమైనట్టి పొట్టే పాలెం కలుజు వద్ద చిన్న బ్రిడ్జ్ నిర్మాణం కి నోచుకోక ఇబ్బందికరంగా ఉంది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న వైసీపీ నాయకులను సార్వత్రిక ఎన్నికల్లో ఇంటికి పంపించాలి.. కేవలం సంక్షేమ పథకాలు నియంతృత్వ దోరణి తో సాగే పక్క రాష్ట్ర దొరలను ఏ విధంగా తరిమికొట్టారో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ను అదేవిధంగా తరిమేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్, ఆశయాలను జనసేన పార్టీ గారి లక్ష్యాలను ప్రజలకు చేరవేసే విధంగా జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, నాగబాబు, అజయ్ సూచనలో జనసేన పార్టీని నగరంలో ముందుకు తీసుకెళ్తాం.
వాడవాడలా జనసేన జెండా ఏర్పాటు చేసి మద్దతు దారులను ఏకం చేసి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు మా వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జనసేన సీనియర్ నాయకులు, చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏటూరి రవికుమార్, జనసేన జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, వెంకటేశ్వర పురం నాయకులు కుక్క ప్రభాకర్, జనసేన సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, కాకు మురళీ రెడ్డి, జిల్లా కార్యదర్శి కోవూర్ కేర్ టేకర్ గుడి హరి రెడ్డి, వీరమహిళలు నాగరత్నం, రేణుక, నగర కార్యదర్శి హైమావతి, కృష్ణవేణి, వరుణ్ తేజ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గుర్రం కిషోర్, 5 వ డివిజన్ నాయకులు మోష, ప్రశాంత్ గౌడ్, శ్రీను, కార్తీక్, మౌనేష్, హేమచంద్ర యాదవ్, బన్నీ, వర, షాజహాన్, ఖలీల్, కేశవ, తెలుగుదేశం నాయకులు అషిక్, సుబ్బారాయుడు, శ్రీనివాసు రెడ్డి తదితర జనసేన, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.