వారికి రోజుకో కొత్తమ్మాయి కావాలి

ప్రముఖ నటి పాయల్ ఘోష్ బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో లైంగిక వేధింపుల బారిన పడిన వారిలో తాను కూడా ఉన్నానని కంగనా కూడా చెప్పింది. బాలీవుడ్ లో చాలా పెద్ద హీరోలు తమ పట్ల లాకింగ్ వ్యాన్ లో కానీ రూంలో కానీ, పార్టీల్లో పాల్గొన్నపుడు కానీ అసభ్యంగా ప్రవర్తించేవారని, పని కోసం అపాయింట్ మెంట్ తీసుకుని ఇంటికి రావాలని చెప్పి, బలవంతం చేసేవారని ట్విటర్ లో ట్వీట్ చేసింది.

బాలీవుడ్ సెక్సువల్ ప్రీడేటర్స్ లతో నిండిపోయింది. వారివి ( బాలీవుడ్ హీరోలు, ప్రముఖులు) డమ్మీ పెళ్లిళ్లు. వారు సంతోషంగా ఉండేందుకు ప్రతీ రోజు హాట్ గా ఉండే కొత్త యువతిని కోరుకొంటారు. యువకు ల విషయంలో కూడా వారు ఇలానే చేస్తుంటారు. నా మార్గంలో నేను సెటిల్ అయ్యాను. కానీ చాలా మంది యువతులు వారికి బలయ్యారని కంగనా ట్వీట్ లోపేర్కొంది.