గూడూరు ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన తీగల చంద్రశేఖర్ రావు

గూడూరు: ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం పోరాటం చేస్తూ సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ కృషిచేస్తున్నారని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు అన్నారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు సోమవారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలను వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బుధవారం గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో టీం పిడికిలి రూపొందించిన “ఇక తగ్గేదే లే” నినాదంతో ఉన్న గోడ పత్రికలను జనసేన పార్టీ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మూడువేల మందికి పైబడి కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కౌలు రైతుల కుటుంబాలకు సొంత నిధులతో 30 కోట్ల ఆర్థిక సహాయం అందజేస్తూ వారి పిల్లల చదువులకు అండగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిలబడ్డారని, 151 మంది ఎమ్మెల్యేలు కలిగి ఉండి ప్రభుత్వం అధికారంలో ఉన్న వైసిపి పార్టీ వారికి ఏమి చేసిందని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపు, ఓటమిలు సాధారణమని, 2009 లో ఎం.పి గా పోటీ చేసి ఓడిపోయిన మీరు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని విమర్శించడం, ఓడిపోయారని హేళనగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని వెల్లడించారు. ఈసారి మీకు టిక్కెట్ ఇవ్వరని మీ పార్టీ నాయకులే చాలా అవహేళనగా మాట్లాడుతూ ఓ కమెడియన్ లాగా మిమ్మల్ని చిత్రీకరిస్తున్నారు దాని గురించి చూసుకోండి. జనసైనికులు పేదలందరికీ జగనన్న ఇల్లు పథకంలో లోపాలను, అవినీతిని వీడియో, ఫోటోల రూపంలో
ప్రపంచానికి బహిరంగ పరుస్తున్న తరుణంలో వైసిపి నాయకుల్లో వణుకు మొదలైందని దీంతో పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలకు వైసీపీ నాయకులు పాల్పడుతున్నారన్నారు. గూడూరు పట్టణ మరియు నియోజకవర్గ పరిధిలో జగన్ అన్న కాలనీలలో తాము స్వయంగా పర్యటించి అక్కడ ఉన్న పరిస్థితులను స్వయంగా చూశామని, మీడియా దృష్టికి కూడా తీసుకువచ్చామని, గూడూరు జగనన్న లేఅవుట్లో 2000 ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు బహిరంగంగా అబద్దాలు వల్లి వేస్తున్నారా? కళ్లుండి చూడలేని పరిస్థితి లో ఉన్నారో? ఆయన ఎప్పుడు రమ్మన్నా జనసేన నాయకులు “లేని లేఅవుట్లు” వద్దకు వస్తారని ఆయన తెలిపినట్లు అక్కడ రెండు వేల ఇళ్ల నిర్మాణాలు చివరిదశలో ఉన్నట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ ను, ఆయన తల్లిని, వీర మహిళలను వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిట్టినా ఒక్కరోజు స్పందించని ఎమ్మెల్యే, పవన్ కళ్యాణ్ చెప్పు చూపితే బాధపడడం విస్మయం కలిగిస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు మాని గూడూరు అభివృద్ధి పై దృష్టి పెట్టాలని కోరారు. అనంతరం రూరల్, పట్టణ అధ్యక్షులు భాస్కర్, ఇంద్రవర్ధన్ లు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో, అవినీతి, లోపాలను చూపితే సరిదిద్దుకోవాలి కానీ ఎమ్మెల్యే ఇలా విమర్శలు చేయడం ఏమిటని, నియోజకవర్గ ప్రజలకు మీరు చెప్పిన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం, రూరల్ ప్రాంతాల్లో జగనన్న ఇల్లు ఇప్పటికైనా మొదలుపెట్టాలన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ చిల్లకూరు, చిట్టమూరు, వాకాడు మండలం నాయకులు అక్బర్ కుమార్, మనోజ్ కుమార్, గోపాలరెడ్డి, శంకర్, సాయి, శివ, శివమణి, శ్రీనివాసులు, ముత్యాలు, మోహన్, వెంకయ్య, వసంత్ తదితరులు పాల్గొన్నారు.