ఘనంగా “జనంతో జనసేన” మూడవ రోజు

తిరుపతి: స్థానిక 33వ వార్డు సాయిబాబా గుడి, అబ్బన్న కాలనీ పరిసర ప్రాంతాలలో మంగళవారం కొనసాగిన జనంతో జనసేన, ప్రతి ఇంటిలో సమస్యలను వెల్లడించిన స్థానికులు, ఈసారి కచ్చితంగా పవన్ కళ్యాణ్ ను గెలిపించుకుంటామని ప్రజలు జనసేన నాయకులకు హామీ ఇవ్వడమే కాకుండా మన పార్టీ గుర్తు గాజు గ్లాసు అని జనసేన నాయకులకు స్థానిక మహిళలు చెప్పడం విశేషం. ఈ కార్యక్రమం మధుబాబు, బాలాజీ, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, కిరణ్ రాయల్, రాజారెడ్డి మరియు వీరమహిళలు, జనసేన ముఖ్య నేతలు, జనసైనికులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.