స్థానిక పోరు: మూడవ దశ నామినేషన్ ప్రక్రియకు సర్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే రెండు విడతల పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈనెల 9 వ తేదీన తొలివిడత, ఈనెల 13 వ తేదీన రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబందించిన నామినేషన్ల ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభం కాబోతున్నరి. అనంతపురం రెవెన్యూ డివిజన్‌లోని 19 మండలాల్లోని 381 పంచాయితీలకు, 3768 వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. దీనికోసం మొత్తం 3931 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇక ఈనెల 17 వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. అదేరోజున కౌంటింగ్ ఫలితాలు ఉంటాయి.