నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాండ్ర శ్రీనివాసులు మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్ హామీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం. అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర ద్వారా వైకాపా అధికారంలోకి వస్తే మొట్టమొదటగా 230,000 ఉద్యోగాలు విడుదల చేస్తా అన్నారు. అంతే కాకుండా ప్రతి ఏటా జనవరి 1 తారీకున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నారు. ఈ 2023 జనవరి 1 తారీకుకు వైకాపా అధికారంలోకి వచ్చి 4వ జనవరి కూడా వచ్చింది, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదు. మీరిచ్చిన హామీలు నమ్మి మీకు అధికారం ఇస్తే, చిత్తశుద్ధి లేక ఇచ్చిన హామీలను మర్చిపోయి నిరుద్యోగుల నమ్మకాన్ని, ఆశలను నట్టేట ముంచేసింది ఈ వైకాపా ప్రభుత్వం. ఉన్నత చదువుల కోసం మీరు ఇస్తానన్న ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇవ్వకున్నా సామాన్య, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టి కష్ట పడి చదివి డిగ్రీ పట్టాలు వైకాపా ప్రభుతం హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూసి చూసి మోసపోయి జాబ్ లు లేక పరిశ్రమలు రాక నిరుద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరం అయిపోయింది. మీ ప్రభుత్వ మోసానికి గురైన ఈ నిరుద్యోగులే రాబోవు ఎన్నికలలో మీ ఓటమికి ప్రధాన భూమిక పోషించి మీ వైకాపా ప్రభుత్వాన్ని అధికారంకి దూరం చేయబోతున్నారు. జనసేన పార్టీ, ముత్తుకూరు మండల అధ్యక్షులు మనుబోలు గణపతి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత విషయంలో మీ వైకాపా ప్రభుత్వ వైఫల్యానికి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ జనవరి 12న స్వామి వివేకానంద స్పూర్తితో యువశక్తి కార్యక్రమం ద్వారా యువత గళాన్ని వినిపించే విధంగా వారి భవిష్యత్తు కోసం ప్రభుత్వం అవలంబించాల్సిన మార్గదర్శకాలు, విద్యా ఉపాధి హామీలు, వ్యాపార సూత్రాలు మొదలగు అంశాలను యువత ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుసుకొని ఆ అంశాల సాధనే లక్ష్యంగా జనసేన పార్టీ ప్రణాళికలు సిద్ధం చేయడమే జనసేన పార్టీ యువశక్తి కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అని మనుబోలు గణపతి తెలియజేశారు.