తొండంగి మండల సోషల్ మీడియా వర్క్ షాప్

తుని, తొండంగి మండల జనసేన పార్టీ మండల అధ్యక్షులు నాయుడు ఆధ్వర్యంలో సోషల్ మీడియా వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ భేటీలో మండలంలో అధికార ప్రతిపక్ష పార్టీల విమర్శలను ధీటుగా ఎదుర్కొని జనసేన పార్టీ సిద్ధాంతాలను నిరంతరం ప్రజల్లోకి సామాజిక మాధ్యమంలో తీసుకువెళ్తూ కృషి చేస్తున్న జనసేన సోషల్ మీడియా ప్రతినిధులకు నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.