మనోభావాలు దెబ్బతీసే ఫ్లెక్సీలను పెట్టిన వారిని శిక్షించాలి: పాలవలస యశస్వి

విజయనగరం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పల్లకీ మోస్తున్నారని వైసీపీ వారు విజయనగరం పట్టణంలో అన్ని సెంటర్ లలో ఫ్లెక్సీలు పెట్టి జనసైనికుల, పవన్ కళ్యాణ్ అభిమానుల మనోభావాలను కించపరచడాన్ని నిరసిస్తూ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం నియోజకవర్గం ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం జిల్లా ఎస్పీని కలిసి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని శిక్షించవలసిందిగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయనగరం నియోజకవర్గం లీగల్ సెల్ ఇంచార్జి, న్యాయవాది సుబ్రహ్మణ్యం, డా. మురళి మోహన్, ఎర్నాగుల చక్రవర్తి, యోగేష్, మజ్జి శివశంకర్, బొబ్బది చంద్రునాయుడు, కొర్నానా రామకృష్ణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.