జనసేనాని ఇంటిపై జరిగిన రెక్కీని ఖండించిన తోట లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇంటి పై జరిగిన రెక్కీను ఖండిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గ రాజుపాలెం మండలం, అనుపాలెం గ్రామం, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు తోట లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై రెక్కీని నిర్వహిస్తున్నటువంటి వారికి నిర్వహించమన్న వారికి కూడా చెబుతున్నాను.. అర్జెంటుగా మీరు మూట ముళ్ళు సర్దుకుని వెళ్లిపోవాలి లేదంటే మీరు జనసేన సునామీని తట్టుకోలేరని తోట లక్ష్మీనారాయణ హెచ్చరించడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయాలంటే జనసేన సమూహాన్ని దాటుకుని వెళ్లాల్సి వస్తుందని అవసరమైతే మేమందరం జనసైనికులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ ఇంటి ముందు ఒక కాంపౌండ్ వాల్ కంటే స్ట్రాంగ్ గా నిలబడతామని, పవన్ కళ్యాణ్ ని టచ్ చేయాలంటే మమ్మల్ని దాటుకుని వెళ్లాలని వెళ్లలేరని కూడా మీడియా ముఖంగా మీకు హెచ్చరించడం జరుగుతుంది. రాబోయే విపత్తులనుండి కాపాడుకోవాలంటే ఈ ప్రభుత్వం తక్షణమే సెంట్రల్ గవర్నమెంట్ కి లేఖ రాసి జెడ్ కేటగిరి ఇవ్వాలని మేము కోరుతున్నామని తెలియజేసారు. జనాలలో పవన్ కళ్యాణ్ కి వచ్చే ఆదరణ చూసి తట్టుకోలేని సన్నాసులు ఇలాంటి చీపుపనులు చేస్తున్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించడం జరిగింది.