ఘనంగా దుంపటి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు

మధిర, బోనకల్ జనసేన పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బోనకల్ శాంతినిలయంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర సంస్కృతిక అధ్యక్షులు దుంపటి శ్రీనివాసరావు ఘనంగా పుట్టినరోజు వేడుకలు. ఈ సందర్బంగా బోనకల్ బోనకల్ మండల అధ్యక్షులు తాళ్లూరి డేవిడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి పేదల పెన్నిధి దుంపటి శ్రీనివాసరావు నాయకత్వంలో ఉమ్మాడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతం కోసం వారు అహర్నిశలు కష్టపడుతూ కార్యకర్తలకు సూచనలు సలహాలు ఇస్తూ సామాన్య కార్యకర్తల ఉంటూ మరియు ఆదర్శంగా నిలుస్తున్న మా అభిమాన నాయకులు దుంపటి శ్రీనివాస్ నాయకత్వంలో మధిర నియోజకవర్గంలో పార్టీని గ్రామ గ్రామాన తీసుకెళ్లాడానికి మరియు బలోపేతం చేయడానికి మధిర నియోజకవర్గం జనసైనికులు సిద్ధంగా ఉన్నారని అదే విధంగా మరిన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఉన్నత శిఖరాలకి వెళ్లాలని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిసున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎక్సిక్యూటివ్ మెంబెర్ షేక్ జానీపాషా, మండల సహాయ కార్యదర్శి షేక్ బాజి బాబా తదితరులు పాల్గొన్నారు.