‘తిమ్మరుసు’ ఫస్ట్ లుక్

వైవిధ్యమైన కథాంశాలతో, తనదైన నటనాశైలితో డిఫరెంట్ పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరో సత్యదేవ్.. సత్యదేవ్ హీరోగా వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ‘తిమ్మరుసు’ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు(శనివారం) చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘తిమ్మరుసు’ ఫస్ట్ లుక్ లో సత్యదేవ్ చేతిలో ఓ సూట్ కేస్ పట్టుకొని బైక్ పై కూర్చుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తే సత్యదేవ్ మరో కొత్త తరహా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను డిసెంబర్ 9న విడుదల చేస్తున్నట్లు చిత్ర మేకర్స్ ప్రకటించారు.

”తిమ్మరుసు సినిమా ఓ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమట. సత్యదేవ్ ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇదని తెలిపారు. ఈ రోజు ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నాం. డిసెంబర్ 9న టీజర్ ను విడుదల చేస్తాం. ఇప్పటికే చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఇతర విషయాలు తెలియజేస్తాం” అని తెలిపారు. ఫస్ట్ లుక్‌లో సత్యదేవ్ బుల్లెట్‌పై కూర్చొని చాలా సీరియస్‌గా కనిపిస్తున్నారు. ఈ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తుండగా, సత్యదేవ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించనున్నారు.