కరోనా అనేది జస్ట్ బిగినింగ్.. ‘జాంబీ రెడ్డి’ ఫస్ట్ బైట్..

‘రాక్షసం మనుష్య రూపేణా’.. మనుషులు దెయ్యాల్లా మారితే.. పరిస్థితి ఏంటన్నదే ప్రదాన కథాంశంగా తెరకెక్కిన  సినిమా `జాంబీరెడ్డి`. హాలీవుడ్ లో జాంబీ జోనర్‌లో సినిమాలు తయారవుతుంటాయి. అంటే మనుషులే. సడన్ గా దెయ్యాలుగా మారి, సాటి మనుషుల్ని పీక్కుతుంటుంటాయి. దాన్ని జాంబీ జోనర్ అంటారు. తెలుగులో మొదటి సారి ఈ జోనర్‌లో జాంబీ రెడ్డి సినిమా తయారైంది.

ఆ, కల్కి సినిమాలతో ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. బాల నటుడిగా పరిచయమైన తేజా సజ్జా ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. టైటిల్ అనౌన్సమెంట్ దగ్గర నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి విషయం కూడా సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో లేటెస్టుగా ‘జాంబీ రెడ్డి’ మూవీ ఫస్ట్ బైట్ వీడియోను దక్షిణాది అగ్ర కథానాయిక అక్కినేని సమంత ఈరోజు(డిసెంబర్ 5) ఉదయం ఫస్ట్ బైట్ ను విడుదల చేశారు. జాంబీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రంలో మానవాళికి ప్రమాదకరంగా మారిన కోవిడ్-19 మహమ్మారి గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇందులో జాంబీలను చూపించడంతో పాటు కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నట్లు చూపించారు. హీరో తేజ చేతిలో గద పట్టుకొని స్టైలిష్ గా కనిపించగా.. ఆనంది త్రిసూలం మరియు దక్ష గన్ పట్టుకొని జాంబీలతో పోరాటానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. చివరగా కరోనా అనేది జస్ట్ బిగినింగ్ మాత్రమే అని పేర్కొన్నారు. విజువల్స్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ గా అనిపించాయి.