బెంతో ఒరియాల దీక్షకు తిప్పన దుర్యోధన రెడ్డి సంఘీభావం

ఇచ్చాపురం: కవిటి మండలంలో బెంతో ఒరియ సామాజిక వర్గస్తులు కులదృవీకరణ పత్రాలు పునరుద్దరణ కోసం జరుగుతున్న అన్యాయానికి నిరసనగా కొనసాగిస్తున్న 64వ రోజు రిలే నిరాహార దీక్షలో రత్తకన్న గ్రామస్తులు కొనసాగించారు. దీక్ష శిబిరంలో గురువారం జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెంతో ఒరియా గిరిజనులకు కుల గుర్తింపుకై న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని ఈ సమస్యను గౌ. శ్రీ జనేసేన అధినేత పవన్ కల్యాణ్ గారి దృష్టికి మరల తీసుకెళ్తానని అధినేత దృష్టిలో ఉందని జనసేన పార్టీ మద్దతుతో పాటు తమకు అండగా ఉంటాదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెంకర్ సాహు, ప్రేమ్ సాహు, సాయి బిసాయి, లొబ్బో బిసాయి, గోపి బిసాయి, సుమన్ బిసాయి, జయసేన్ బిసాయి, దుదిస్టి మజ్జి, కృష్ణ దలై తదితరులు పాల్గొన్నారు.