జనసేన తీర్ధం పుచ్చుకున్న తిరుపతి సిటీ సీనియర్ లాయర్ ముక్కు సత్యవంతుడు

తిరుపతి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు పార్టీ యొక్క సిద్ధాంతాలు ఇష్టపడి భవిష్యత్ తరాలకు మేలు జరగాలి అంటే పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమని నమ్మి తిరుపతి ప్రెస్ క్లబ్ నందు చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో తిరుపతి సిటీ సీనియర్ లాయర్ ముక్కు సత్యవంతుడు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, జిల్లా కమిటీ సభ్యులు పి.ఆనంద్, జిల్లా సీనియర్ నాయకులు కృష్ణయ్య, జిల్లా యువనాయకులు, సుమన్ రాయల్ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.