టిజేఆర్ సుధాకర్ బాబు మాయమాటలు చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు

  • సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే దళితులు మరియు కాపుల మధ్య గొడవలు పెడుతున్నారు
  • టీజేఆర్ సుధాకర్ బాబు నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే జనసేన పార్టీ చూస్తూ ఉండదు
  • పవన్ కళ్యాణ్ గురించి మీరు ఎంత తిట్టినా మీకు మంత్రి పదవి రాదు గుర్తుపెట్టుకోండి

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, పొన్నలూరు మండలం, జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ మాట్లాడుతూ… రెండు రోజుల క్రితం సంతనూతలపాడు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు చాలా హాస్యస్పదంగా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడు ప్యాకేజీ ఇచ్చినట్లుగా సుధాకర్ బాబు దగ్గరుండి చూసినట్లుగా చెప్తున్నారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించండి, ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి చాలా బాగా జరిగిందని చెప్తున్నారు, మరి సుధాకర్ బాబు గారిని గ్రామంలో కూడా రానివ్వకుండా తరిమి తరిమి కొట్టారు గ్రామ ప్రజలు దానికి మీరు సమాధానం చెప్పాలి. ఈ సుధాకర్ బాబు చెప్పే మాటలన్నీ మాయమాటలు, దళితులకి అన్యాయం జరుగుతుంది ఈ వైసీపీ ప్రభుత్వంలో, ఒంగోలు పాలడైరీ మూతపడటానికి కారణం సుధాకర్ బాబు, మల్లవరం డ్యామ్ గేట్లు కొట్టుకుపోవడానికి కారణం సుధాకర్ బాబు, మిర్చి రైతులకు అన్యాయం జరగడానికి కారణం సుధాకర్ బాబు, మీరు చేసే ప్రతి మోసపూరితమైన సంఘటనలు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు, రాబోయే రోజుల్లో సరైన గుణపాఠం చెప్తారు మీకు, కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనసేన పార్టీ కానీ జనసైనికులు కానీ చూస్తూ ఉండరు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు పవన్ కళ్యాణ్ కి అండగా మద్దతుగా ఉన్నారు, 2024లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు.