నేడు అసోం సీఎంగా హిమంత బిస్వా శర్మ ప్రమాణం

అసోంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోమారు గెలిచిన సంగతి తెలిసిందే. కాగా హిమంత బిశ్వశర్మను అసోం ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. నేడు అసోం సీఎంగా హిమంత బిస్వా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. గువాహటిలోని పంజాబరి ప్రాంతంలోని శ్రీమంత శంకర్‌దేవ్‌ కళాక్షేత్రంలో మధ్యాహ్నం 12 గంటలకు కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. కాగా.. హిమంత బిస్వా శర్మ జలుక్‌బరి నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎన్నికయ్యారు. మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన 2014 ఎన్నికల అనంతరం బీజేపీలో చేరారు. అసోం అసెంబ్లీలో 126 స్థానాలు ఉండగా, ఇటీవల ఎన్నికల్లో బీజేపీ 60 సీట్లు నెగ్గింది. బీజేపీ భాగస్వామ్య పక్షాలు ఏజీపీ 9, యూపీపీఎల్ 6 స్థానాలు గెలిచాయి. కాగా, అసోం సీఎం పీఠం హిమంత బిశ్వశర్మకు దక్కడం వెనుక చాలా డ్రామా నడిచింది. హిమంత బిస్వా శర్మ, ప్రస్తుత సీఎం సర్బానంద సోనోవాల్ మధ్య సీఎం పదవికి పోటీ నెలకొనడంతో.. అధిష్టానం ఇద్దరితో సమావేశమై హిమంత పేరును ఫైనల్ చేసింది.