నేటి యువత దేశానికి భవిత: ముత్తా శశిధర్

కాకినాడ సిటి: 37వ డివిజన్ పాతబస్ స్టాండ్ ప్రాంతంలోని యువకులు జనసేన పార్టీ చేపడుతున్న ప్రచార కార్యక్రమంలో వారు మేనిఫెస్టోలో జనసౌభాగ్యపధం పధకం గురించి ఆసక్తి చూపెడుతూ వివరాలకోసం వాకబుచేయడం తెలుసుకున్న జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ వారి ఆహ్వానంపై కలవడం జరిగినది. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ స్థానిక మత్స్యకారులమైన తాము తగిన రాబడి లేకపోవడంతో కులవృత్తిని మాని తమకు అనుభవం ఉన్న ఎలక్ట్రికల్ సర్వీసులు మరియు ఉపకరణాల వ్యాపారం చేపట్టామనీ, కానీ తగిన పెట్టుబడులు పెట్టే స్తోమతలేక, బ్యాంకులలో ఋణసదుపాయం పొందలేక నిస్సహాయ స్థితిలో ఉండగా జనసేన పార్టీ వారు ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో జనసౌభాగ్యపధం గురించి తమకి తెలిసిందనీ ఈ పధకం వల్ల తమకి మంచి జరుగుతుందనీ ఇలాంటి పధకాన్ని చేపడతానంటున్న జనసేన పార్టీకి తాము ఇప్పటినుండే మద్దతు ఇస్తామనీ, అధికారం చేపట్టాకా తమకి తగువిధంగా ఈ పధకాన్ని అందచేయవలసినదిగా ముత్తా శశిధర్ ని కోరారు. దీనిపై ముత్తా శశిధర్ స్పందిస్తూ నేటి యువత దేశానికి భవిత అనీ కానీ వీరు తగినంత మద్దతు దొరకక నిస్తేజమవుతున్నది గమనించి తమ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువతని ప్రోత్సహిస్తూ జనసౌభాగ్యపధం అనే పధకంతో వారికి సహాయం అందచేసి తద్వారా పదిమందికి ఉపాధి కలిగించేలా చేస్తూ ఉత్పాదకతను పెంచేలా ఆర్ధిక అభివృద్ధిని చేయాలని తలుస్తున్నారనీ, తప్పకుండా ఈ యువకులకి తన ప్రోత్సాహం ఉంటుందని హామీ ఇచ్చారు. వీరు మరింతమందికి స్పూర్తి కావాలనీ, తెలియనివారికి తెలియచేయాలనీ, ఇదే విధంగా మరింతమంది ఆలోచనచేస్తే పేదరికాన్ని రూపుమాపి నవభారతాన్ని నిర్మించుకోవచ్చన్నారు. ముత్తా శశిధర్ వీరిని ప్రోత్సాహిస్తూ నేటినుండే దీనికి కావాలిసిన పేపర్ వర్క్ మొదలుపెట్టుకోవాలనీ రాబోయే ఉగాదికి తమ జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వంలో వీరు వెంటనే పధకంలో సహాయంపొంది నూతన జీవితాన్ని ఆరంభించాలని అభిలాషని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో యువకులు పినపోతు సత్తిబాబు, బలసాడి మూర్తి, పెమ్మాడి త్రిమూర్తులు, కాలాడి నూకరాజు, దండుప్రోలు బాబీ, దండుబ్రోలు రవికుమారు, ఎం.డి షేక్ ఆలీ, తాడి రఘు, పోతాబత్తుల రాంబాబు, బలసాడి సతీష్ తో పాటూ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య తదితరులు పాల్గొన్నారు.