ఒకే ఫ్రేమ్ లో టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్

టాలీవుడ్ డైరెక్టర్స్ అంతా కలసి వీలు దొరికినప్పుడల్లా రెగ్యులర్‌గా పార్టీలు చేసుకుంటూనే ఉంటారు. మన తెలుగు  ఇండస్ట్రీలో దర్శకుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఎవరు హిట్స్ ఇచ్చినా కూడా వెంటనే మరొకరు ఫోన్ చేసి విష్ చేస్తుంటారు. అయితే  తాజాగా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకులంతా కలిసి ఓ చోట చేరి పార్టీ చేసుకున్నారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అంతా ఒకే చోట చేరడంతో ఆ చోటు కూడా చూడడానికి సందడిగా మారిoది. ఈ అద్భుతమైన ఫోటోను తన ఫోన్‌లో బంధించాడు రాజమౌళి. అయితే ఈ పార్టీలో అంతా కనిపించినా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్, వినాయక్ జాడ మాత్రం కనిపించలేదు. ఈ పార్టీలో దర్శక ధీరుడు రాజమౌళితో పాటు క్రిష్ జాగర్లమూడి, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, సుకుమార్, హరీష్ శంకర్ ఉన్నారు. అంతా కలిసి ఒకే చోట అదిరిపోయేలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు దర్శకుడు క్రిష్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.