పర్యటకులారా జరబద్రం జగనన్న రోడ్లు, భాగ్యమ్మ బాట గుంతలమయం

పాడేరు: జి.మాడుగుల మండలం, గెమ్మెలి పంచాయితీ మద్దులబంధ గ్రామ పరిధిలో జి.మాడుగుల నుంచి తాజంగి వెళ్లే రహదారి పూర్తిగా గుంతల మయంగా మారి రానుపోను ప్రయాణికులకి ప్రమాదబరితంగా తయారయ్యింది. పరిసరా గ్రామాల ప్రజలు అత్యవసర సమయంలో మండల కేంద్రానికి చేరుకోవలనుకున్నా, జి.మాడుగుల మండలం నుంచి తాజంగి, నర్సీపట్నానికి వెల్లలనుకున్నా ఈ రహదారి ముఖ్యమైనది కానీ పాలకులకి ఇవేమీ పట్టదు. ఈ విషయం తెలిసి జనసేన పార్టీ జి.మాడుగుల మండల నాయకులు మరియు మండల కమిటీ సభ్యులు జగనన్న రోడ్ల నాణ్యత, జగమంతా తెలుసు అంటు స్వయంగా శ్రమదానం చేసి గుంతలు పూడ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దయచేసి త్వరలో శీతాకాలం రానున్నది ఏజెన్సీ ప్రాంతమంతా పచ్చగా ఉన్న అడవికన్యకి సిగలో బొండు మల్లెలు సింగరించినట్టు పలచాటి మంచు తెరలు కమ్ముకుని ప్రకృతి ఆహ్లాదకరంగా కనిపిస్తూ పర్యాటకులకు దక్షిణ భారతదేశంలో కాశ్మీర్ ని తలపించేలా మైమరిపిస్తోంది. ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ జగనన్న బ్రాండ్ తాగి ఆధామరిచి వాహనాలు డ్రైవింగ్ చేస్తే తిన్నగా యమపురికి చేరుకోవాల్సిందే! దయచేసి పర్యాటకులు ఈ విషయం గమనించాలని, మా ప్రాంత ప్రజలకు ఈ రోడ్ల గుంతలు అలవాటైందని, గిరిజన ప్రజలు సమస్యలతో సర్దుబాటు చేసుకుంటున్నారన్నారు. ఈ జగనన్న రోడ్లు, భాగ్యమ్మ బాట గుంతలు పూడ్చే కార్యక్రమంలో జి.మాడుగుల మండల నాయకులు అధ్యక్షులు మసాడి భీమన్న, తాంగుల రమేష్, మసాడి సింహాచలం, భాను ప్రసాద్ తదితర మండల కమిటీ సభ్యులు జనసైనికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.