డా.బాబు జగ్జీవన్ రామ్ కు గునుకుల కిషోర్ ఘననివాళి

నెల్లూరు, డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నెల్లూరు రూరల్ వేదాయపాలెం నందు గల విగ్రహానికి జనసేన పార్టీ తరపున నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అణగారిన వర్గాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన మహనీయులు స్వాతంత్ర సమర యోధులు భారత మాజీ ప్రధాని బాబు జగ్జ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున నివాళులు అర్పిస్తాముని, మహాత్ములు స్ఫూర్తితో అన్ని వర్గాల వారికి రాజ్యాధికారం అందేలా పోరాడుతున్న పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కు కృషి చేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషోర్, కోలా విజయలక్ష్మి, వాని, వెంకట్, ఖలీల్, బాలాజీ, శ్రీను, నారాయణ, హుమాయూన్, ప్రశాంత్ గౌడ్, షాజహాన్ తదితరులు పాల్గొన్నారు.