కొవ్వూరు జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్‌కు ఘన నివాళులు

కొవ్వూరు: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా గాయత్రి వెంకటేశ్వర ఆధ్వర్యంలో కొవ్వూరు నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులంతా అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ముఖ్యంగా నాయకులు అన్ని జిల్లాల్లోని, అన్ని మండలాల్లోని, అన్ని గ్రామాల్లోని అంబేద్కర్ విగ్రహాలను పూలమాలలతో సత్కరించి ఘన నివాళి అర్పించవలసిందిగా అధిష్టానం నిర్ణయించింది. అధిష్టానం ఆదేశాల మేరకు మంగళవారం అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం గాయత్రి వెంకటేశ్వర ఆధ్వర్యంలో తాళ్లపూడి మండల అధ్యక్షులు గంటా కృష్ణ, కొవ్వూరు పట్టణంలో కోటే చందర్ రావు, కోటే హరీష్, డేగల రాము ఎస్సీ నాయకుడు బొంత శ్యాము, కొవ్వూరు పార్టిసిపెంట్స్ వైవి రాఘవులు, శీతల్, కొప్పాక విజయ్ కుమార్, మరియు ఎంపీటీసీ సభ్యులు కాపవరం సురేష్, సుంకర సత్తిబాబు, కాలపుడి మండలంలోని నాయకులు నామాల బోరయ్య, వీర్రాజు, తదితర పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.