బాలగంగాధర్ తిలక్ కు ఘన నివాళులు

పర్చూరు: బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం, కడవకుదురు గ్రామంలో జనసేన పార్టీ కడవకుదురు కార్యాలయంలో స్వరాజ్యం నా జన్మ హక్కు అని దానిని సాధించి తీరుతానంటూ భారతదేశం మొత్తం తిరిగి చాటి చెప్పిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్ 167వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం కడవకుదురు జనసేన పార్టీ నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి హరిబాబు మాట్లాడుతూ.. భారతదేశంలో బాల్యవివాహాలను నిరసిస్తూ వితంతు వివాహాను ప్రోత్సహిస్తూ జాతీయ స్ఫూర్తిని రగల్చడానికి ఆయనగా స్ఫూర్తిగా నిలిచారని కొని ఆడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు సందు శ్రీనివాసరావు యువ నాయకులు అశోక్ చక్రవర్తి గాజుల కృష్ణ, గొల్లపూడి వసంతరాయుడు, అనంత యశ్వంతు, గొల్లపూడి లక్ష్మణరావు, బత్తిన పున్నయ్య, దేవరకొండ రవి, అడుసుమల్లి ఉమామహేశ్వరరావు, పలపోలు పున్నయ్య, అడపాల శ్రీను, గొల్లపూడి బుల్లోడు తదితరులు పాల్గొన్నారు.