జనసేన ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి నియోజకవర్గ జనసేన ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్లో, జనసేన ఇంఛార్జ్ డా.మాధవ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది. వేడుకలలో భాగంగా డా, బి. ఆర్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి, అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేయటం జరిగింది. ఈ సంధర్భంగా జనసేన పార్టీ, శేరిలింగంపల్లి నియోజక వర్గ ఇంఛార్జ్ డా.మాధవ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం అంతా ఆగష్టు 15, 1947న స్వాతంత్ర్యం పొంది స్వేచ్ఛా వాయువులు తీసుకుంటున్న తరుణమది. అయితే మన ఆనాటి హైదరాబాద్ సంస్థానం మాత్రం స్వేచ్ఛా వాయువుల కోసం ఎదురు చూస్తున్నాం. ఆసమయంలో ఆనాటి భారత ఉపప్రధాని, సర్దార్ వల్లభాయ్ పటేల్ తన చాణక్యంతో నైజాం నవాబు, దాస్య శృంఖలాల నుండి ఖాసీం రజ్వీ నియంతృత్వపు పోకడల నుండి విముక్తిని కలిగించారని, అందుకే ఈరోజున మనం తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నామని, ఈ రోజు కోసం వేలాది మంది యువతీ, యువకులు, వందలాది గ్రామాలు తమ సర్వస్వాన్ని కోల్పోయారని, ఆనాటి అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఈ రోజున మనం ఇంత ప్రశాంతంగా స్వేచ్చా స్వాతంత్రపు వాయువులను అందుకోగలుగుతున్నామని, వీర బైరాన్ పల్లి, గుండ్రాం పల్లి, బీబీనగర్, నల్లగొండ లోని రేణిగుంట లాంటి వందలాది గ్రామాలు నిజాం నవాబు నియంతృత్వానికి వ్యతిరేఖంగా తిరగబడి ఉద్యమాలు చేసారు, ఆనాటి యువతీ యువకుల ఉద్యమ స్ఫూర్తి నిజంగా స్ఫూర్తిదాయకం అని అన్నారు. మన లింగంపల్లికి సంబంధించిన “పోయబుల్లా ఖాన్” అనే అమర వీరుడు ఇమ్రోజ్’ అనే వార్తా పత్రిక ద్వారా నాటి హైదరాబాద్ సంస్థాన ప్రజలను ఉత్తేజితులు చేసేవాడు, అయితే ఒక రోజు నిజాం నవాబు అనుచరులు ఒక కాలరాత్రి, లింగంపల్లి చౌరస్తా దగ్గర కాపురాచి హత్య చేసారన్నారు, ఇలా తెలంగాణకు విమోచనం కలిగించటంలో శేరిలింగంపల్లి ప్రజలది సైతం ప్రత్యేకమైన పాత్ర అని కొనియాడారు. వరుస ఉద్యమాల తర్వాత ఆపరేషన్ పోలో పేరుతో సెప్టెంబర్ 17న, ఉపప్రధాని వల్లభాయ్ పటేల్ నిజాం నవాబు మెడలు వంచి తెలంగాణకు విమోచనం కలిగించారన్నారు. నాటి అమరవీరుల పోరాట స్పూర్తిని ఆదర్శంగా తీసుకోని ప్రస్తుతం పాలకులు చేస్తున్న తప్పులను ఎండ గట్టాలని, భాధ్యత గల యువతీ, యువకులుగా కాళోజి ఆశయాలకు అనుగుణంగా పరాయివాడు తప్పుచేస్తే పోలిమేర దాటే వరకు తరిమి వెయ్యాలని, మనవాడే తప్పుచేస్తే ఇక్కడే బొందపెట్టాలని, లేదంటే గద్దె దింపే వరకు ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, బి అరుణ్ కుమార్, లక్ష్మీనారాయణ, హనుమంత్ నాయక్, ప్రదీప్, పుష్పలత, పద్మజ, రమేష్, మాధవరావు, ఆనంద్ రావు మరియు ఇతర జనసేన కారకర్తలు తదితరులు పాల్గొన్నారు.