అశ్రునయనాలతో పలువురికి ఘన నివాళులు

సీతానగరం మండలంలో పలు గ్రామాలకు చెందిన కొంతమంది ఇటీవల కాలంలో స్వర్గస్తులు కాగా వారికి శ్రద్ధాంజలి ఘటించి ఘన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పిన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి.

  • సీతానగరం గ్రామానికి చెందిన చాకూరి అనసూయ అనారోగ్యంతో నిర్యాణం చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆమెకు ఘన నివాళులు అర్పించడం జరిగింది.
  • సీతానగరం మండలం, సింగవరం గ్రామానికి చెందిన పులిదిండి రాముడు అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా ₹5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
  • వంగలపూడి గ్రామానికి చెందిన కవులూరి వెంకట్రావు భార్య సూర్యవతి వైకుంఠ ప్రాప్తి పొందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమెకు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.

రాపాక ంప్త్చ్ అభ్యర్థి కరణం భద్ర అక్క ఇటీవల కాలంలో పరమపదించగా భద్ర కి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది.

  • సీతానగరం మండలం, రాపాక గ్రామంలో భారీశెట్టి వెంకటరమణ కుమారుడు పోలియోతో బాధపడుతూ కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం చెప్పడం జరిగింది.
  • ఇనుగంటి వారి పేట గ్రామ వాస్తవ్యులు పెందుర్తి సత్యం ఇటీవల స్వర్గస్తులు కాగ.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సత్యం కి అశ్రునయనాలతో నివాళులు అర్పించడం జరిగింది.
  • ఇనుగంటి వారి పేట గ్రామంలో గాదరాడ శ్రీను ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి, నివాళులర్పించడం జరిగింది.
  • శ్రీ సాయి సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్యం రామకృష్ణ (ఇనుగంటివారిపేట) ఇటీవల కాలంలో స్వర్గస్తులు కాగా వారికి ఘనంగా నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పడం జరిగింది.
  • ఇనుగంటి వారి పేట వాస్తవ్యులు మేడిశెట్టి శ్రీను తండ్రి మేడిశెట్టి సూర్యారావు ఇటీవల స్వర్గస్తులు కాగా వారికి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమాల్లో మట్టా వెంకటేశ్వరరావు, మద్దాల ఏసుపాదం, ప్రశాంత్ చౌదరి, చీకట్ల వీర్రాజు, నాగవరపు సత్తిబాబు, చిక్కం నాగేంద్ర, పిండి వివేక్, బండి సత్య ప్రసాద్, కొండేటి సత్యనారాయణ, అనిల్, చిక్కం నాగేంద్ర, పిండి వివేక్, దార్ల వీరబ్రహ్మం, కుంచె లక్ష్మణరావు, దుల్ల అనిల్, షేక్ భాషా, పెంటపాటి శివ, గాదరాడ శ్రీను, తోట అనిల్ వాసు ఇతర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.