కాకినాడ జనసేన ఆధ్వర్యంలో పి.వి నరసింహారావుకు ఘన నివాళులు

కాకినాడ సిటి: జనసేన పార్టీ ఆధ్వర్యంలో పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో భారతరత్నగా ప్రకటింపబడ్డ దివంగత ప్రధాని శ్రీ. పి.వి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా దంటు భాస్కర్, సీనియర్ న్యాయవాదులు వెంకటేష్ మెర్ల నరసింహారావు పాల్గొన్నారు. శుక్రవారం కేంద్రప్రభుత్వం తెలుగువారైన కీర్తిశేషులు మాజీ భారత ప్రధాని శ్రీ.పాములపర్తి వేంకట నరసింహారావుకి దేశాత్యున్నత పురస్కారం అయిన భారతరత్న అవార్డుని ప్రకటించిన సందర్భంగా తన హర్షాన్ని ముత్తా శశిధర్ వ్యక్తపరిచారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ. పి.వి నరసింహారావు గారికి కాకినాడతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆనాడు కేంద్ర విదేశాంగ శాఖా మంత్రిహోదాలో శాసనసభ్యులుగాను మరియు మునిసిపల్ చైర్మంగా సేవలు అందించిన దంటు భాస్కర రావుగారి విగ్రహావిష్కరణకి కాకినాడ రావడం జరిగిందనీ, వారికుటుంబ సభ్యుడు మనువడు అయిన భాస్కర్, ప్రముఖ న్యాయవాదులు మెర్ల నరసింహారావు, అయ్యగారి వెంకటేష్ గార్లతో ఆయన ఆవిష్కరించిన శిలాఫలకంవద్ద వారి చిత్రపటానికి నివాళులు అర్పించి భారతరత్న పి.వి నరసింహారావుగారి సేవలను శ్లాఘించారు. మొట్టమొదటి భారతరత్న పొందిన తెలుగువ్యక్తిగా తెలుగువారికి గర్వకారణమైన వారి ఙ్ఞ్యాపకార్ధం కాకినాడ నగరంలో కూడా నిర్మాణం చేయాలని అకాంక్షించారు. దంటు భాస్కర్ తన తాతగారితో పి.వి నరసింహారావుగారి స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ ఈ విగ్రహ ఆవిష్కరణకి వచ్చినప్పుడు తమకుటుంబ ఆతిధ్యాన్ని స్వీకరించి తన స్నేహాన్ని గౌరవించిన గొప్ప మనిషి అని, అలాంటి వీరికి భారతరత్న రావడం సంతోషంగా ఉన్నారు. మెర్లనరసింహారావుగారు మాట్లాడుతూ తమ తాతగారితో పి.వి నరసింహారావు అనుబంధాల గుర్తులను పంచుకుకున్నారు. అయ్యగారి వెంకటేష్ మాట్లాడుతూ దేశం అతలాకుతలం అయిపొతున్న వేళ ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టి ఆర్ధిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి విపక్షాలతోనే కాక ప్రపంచదేశాల మెప్పును పొందిన మహనీయుడనీ, నేడు ప్రపంచ దేశాలతో పోటీపడుతున్న స్థాయి ఆయన విశేషకృషి అని భారతరత్న ప్రకటిచి గౌరవించడం సముచితగౌరవం అని హర్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి ఉదయభాస్కర్, ఆకుల శ్రీను, మనోహర్ లాల్ గుప్తా, వాడ్రేవు లోవరాజు, కంట రవిశంకర్, తోరం చిరంజీవి, మురళీకృష్ణ, నగేష్, వాసిరెడ్డి సతీష్, గోవిందరావు, వాసిరెడ్డి సత్యకుమార్ దుర్గాప్రసాద్ , తోట కుమార్ సాధనల గంగాధర్, చీకట్ల శ్రీనివాసు, వీరమహిళలు రచ్చ ధనలక్ష్మి, మిరియాల హేమావతి, చొడిపల్లి సత్యవతి, బేబీ తదితరులు పాల్గొన్నారు.