మోదీకి ట్రంప్ విషెస్

భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్బంగా మోదీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ బర్త్‌డే విషెస్ తెలిపారు. గురువారం రోజున మోదీ 70వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాధినేతలు భారత ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. డోనాల్డ్ ట్రంప్ కూడా మోదీకి విషెస్ చెప్పారు. గొప్ప నాయకుడు, విశ్వాస మిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఫిబ్రవరిలో ఇండియా టూర్‌కు వచ్చినప్పుడు అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన ఫోటోను కూడా తన విషెస్ ట్వీట్‌లో ట్రంప్ పోస్టు చేయడం గమనార్హం. మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఉన్నారు.