పాము కాటుల నుండి ప్రజల్ని కాపాడే ప్రాణదాత, భాస్కర్ నాయుడుని బ్రతికించాల్సిన బాధ్యత టీటీడీదే

తిరుమల తిరుపతి దేవస్థానాలలోని విద్య, వైద్య సంస్థలలో ఎక్కడ విష సర్పాలు కనిపించినా, వాటిని టిటిడి ఉద్యోగి భాస్కర్ నాయుడు.. ఆయన సర్వీస్ ఉన్నంతకాలం ఆయన ప్రాణాలను పణంగా పెట్టి, పాములను పట్టుకుని అడవుల్లో వదిలి, ప్రజల్ని… అటు పాముల ప్రాణాల్ని కాపాడిన వ్యక్తిగా ఓ చరిత్ర ఉంది. అతను ఉద్యోగం నుండి రిటైర్ అయినప్పటికీ కూడా పామును పట్టే కోణంలో పాము కాటుకు గురై, ప్రైవేట్ హాస్పిటల్ నందు ప్రాణాపాయ స్థితిలో ఉంటే టీటీడీ యాజమాన్యం పట్టించుకోక పోవడం బాధాకరమని జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఆవేదన వ్యక్తం చేశారు.

బుధవారం భాస్కర్ నాయుడు చికిత్స పొందుతున్న ప్రైవేట్ హాస్పిటల్ లో భాస్కర్ నాయుడును పరామర్శించిన, జనసేన నాయకులు. భాస్కర్ నాయుడు ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వచ్చేవరకు అయ్యే ఖర్చులను పూర్తిగా దేవస్థానం భరించాలని వారి కుటుంబానికి అండగా నిలవాలని, జనసేన పట్టణ అధ్యక్షుడు రాజా రెడ్డి తో కలిసి కిరణ్ డిమాండ్ చేశారు.