తురంగి గ్రామకమిటీ సమావేశం

కాకినాడ రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం తురంగి గ్రామకమిటీ అధ్యక్షులు పితాని తేజ అధ్యక్షతన జరిగిన సమావేశం. నసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పంతం నానాజీ స్వగృహం గొడరిగుంటలో సమావేశం జరిగింది. కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమావేశంలో కమిటీ వారితో మాట్లాడుతూ… జగన్ రెడ్డి ప్రభుత్వం వలన ప్రజల ఎన్నో రకాలుగా బాధలకు గురిచేస్తోంది. ఇసుక, గ్యాస్, నిత్యావసర వస్తువులు, పెట్రోలు మొదలగునవి మరియు మద్యం అమ్మగా వచ్చిన డబ్బులు జగన్ రెడ్డి సొంత ఖజానాకి మల్లించడం వలన ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని ప్రజలను ఏమార్చుతున్నారు. సామాన్యుడికి అందుబాటులో లేకపోవడం, రేషన్, పెన్షన్ సరిగా అందివ్వక పోవడం, ఆర్టిసి చార్జిలు పెంచేయడం తదితర అంశాలపై ప్రశ్నించేవారిపై, దౌర్జన్యం, దుర్మాగాలు, అరాచకాలు సృష్టించడం ఏమిటీ అని ప్రశ్నించేవారిపై దాడులు చేయడం చాలా దారుణం. దీన్ని మేము పూర్తిగా ఖండుస్తున్నాము. జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడ సంతోషంగా లేరు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలకి వచ్చే నిధులను వేరే వాటికీ మల్లించడం, పంచాయతీలు అభివృద్దకి అడ్డుపడటం, పంచాయతిలలో సరైన సదుపాయాలు కల్పించక పొగా ప్రజలవద్ద నుండి లేని వాటికీ కూడా పన్నులు కట్టించుకోవడం చాలా దారుణమని అధికారులు వాటిపై దృష్టి పెట్టి సమస్యలు వెంటనే పూర్తిచేయాలని. లేని పక్షంలో జనసైనికులతో కలిసి గ్రామాల్లో ప్రజలపక్షాన పోరాడతమని తెలిపారు. త్వరలో అన్నీ గ్రామాల్లో పర్యటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్, తూరంగి జనసేన నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, రాష్ట్ర, జిల్లా, మండల కమిటీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.