రాజాంలో టిడిపి రిలే దీక్షకు యు.పి.రాజు సంఘీభావం

రాజాం నియోజకవర్గం: స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా రాజాం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కొండ్రు మురళి మోహన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యు.పి.రాజు దీక్షా శిబిరం వద్దకు వెళ్లి మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గం నాయకులు యు.పి.రాజు మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సు కోరి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్తాయని ప్రకటించారు అని, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి కట్టుబడి సోమవారం టీడీపీ చేస్తున్న దీక్షకు జనసేన పార్టీ తరుపున పూర్తి మద్దతు తెలపడం జరిగింది అని అన్నారు. ఇంకో ఆరు నెలలలో ఈ రాక్షస పాలన అంతంకాక తప్పదు అని అన్నారు. అందరూ జనసేన టీడీపీ పార్టీలకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు గొర్లె గోవిందరావు, నాలుగు మండలాల నాయకులు ఎన్ని సత్యనారాయణ, హరిబాబు, నాగరాజు, ఈశ్వర్, చిరంజీవి, గణేష్ మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.