జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు

విజయనగరం, శుభకృత నామ సంవత్సర ఉగాది సందర్బంగా జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జ్ పాలవలస యశస్వి పంచాంగ శ్రవణం చేయించారు, అనంతరం అప్పుల్లేని రాష్ట్రంగా మార్చేందుకు జనసేన అధినేత ప్రవేశపెట్టిన షణ్ముఖ వ్యూహం కరపత్రాల్ని యశస్వి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కొత్త తెలుగు సంవత్సరాదిలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుండి పీడస్తున్న బాధలు ప్రజలకు త్వరలోనే విముక్తి కలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన ఝాన్సీ వీరమహిళ విభాగం, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మిలక్ష్మి రాజ్, వీరామహిళ మాతా గాయిత్రి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, త్యాడ రామకృష్ణారావు(బాలు), మర్రాపు సురేష్, యర్నాగుల చక్రవర్తి, లోక్ నాధ్ పట్నాయక్, టి.రామకృష్ణ, సలీం, రవి, అనిల్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.