ప్లవ నామ సంవత్సరంలో ఇంటింటా సిరులు నిండాలి: సీఎం జగన్

రేపు తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా సీఎం జగన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఉగాది శుభాకాంక్షలు అంటూ ఓ ప్రకటన చేశారు. ప్లవ నామ సంవత్సరంలో ఇంటింటా సిరులు, ఆనందాలు నిండాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది కూడా సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు (రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా) సుభిక్షంగా ఉండాలని అభిలషించారు.