సునీల్ బొమ్మిడితో యూకే జనసేన మీట్ అండ్ గ్రీట్

యూ.కే, ఆంధ్రప్రదేశ్, నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్, జనసేన పార్టీ మత్స్యకార విభాగ చైర్మన్ మరియు జనసేన-టిడిపి సమన్వయ కర్త అయినటువంటి నాయకర్ బొమ్మిడి సోదరులు సునీల్ బొమ్మిడి, అలుపెరగకుండా అనేక దేశాలు తిరుగుతూ… జనసేన గురించి ప్రమోట్ చేస్తూ.. నరసాపురంలో ఉన్న ఓటర్లను, బంధువులను ప్రభావితం చేస్తూ 2024 ఎన్నికలకి ఓటు జనసేనకే వేసే విధంగా ప్రసంగాలు ఇస్తూ… మీట్ అండ్ గ్రీట్ అంటూ దుబాయ్, కెనడా అండ్ యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికాలో సమావేశాలు నిర్వహిస్తూ ఆదివారం యునైటెడ్ కింగ్డమ్, బర్మింగ్హామ్ అండ్ లండన్ లో ఉన్న హాన్స్లో నగరాలలో ఉన్న జనసైనికులు మరియు వీరమహిళలను కలవడం జరిగింది. యూకే జనసేన టీం ఘనంగా సునీల్ బొమ్మిడిని రిసీవ్ చేసుకొని… సన్మానించడం జరిగింది. యూకేలో ఉన్న జనసైనికులు మరియు వీరమహిళలు ఈ సమావేశంలో పాల్గొని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పరిస్థితులను తెలుసుకొని, ఈ సందర్భంగా వారికి ఉన్న ప్రశ్నలకు సునీల్ బొమ్మిడి ఎంతో ఓపికగా చాలా చక్కగా సమాధానములు ఇచ్చి జనసైనికులు మరియు వీర మహిళలలో ఉత్సాహాన్ని నింపేలా ప్రసంగం ఇవ్వటం జరిగింది. నాయకర్ బొమ్మిడి జూమ్ కాల్ లో జాయిన్ అయ్యి యునైటెడ్ కింగ్డమ్ లో ఉన్న జనసైనికులు మరియూ వీరమహిళతో మాట్లాడి జనసేన పార్టీని బలపరుస్తూ 2024 ఎన్నికలలో జనసేన పార్టీ అధ్యక్షులు అయిన పవన్ కళ్యాణ్ ని సీఎంని చేసే విధంగా ముందుకు వెళ్తున్నాము అని చెప్పటం జరిగింది. ఈ సమావేశం నాగరాజు వడ్రాణం, శంకర్ సిద్ధం, చందు సిద్ధం అద్వర్యంలో యూకే జనసైనికుల టీం సపోర్ట్ తో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో శ్రీనివాస్ రంకిరెడ్డి, అచ్యుత రాజ్, జోజి బాబు గుబిలి, రామకృష్ణ తిరుమలశెట్టి, భాను ఉల్లంకి, శివకుమార్ మేక, కళ్యాణ్ వడ్డీ, అఖిల్ పెండ్యాల, అరుణ్ ఘంటా, శివ తిరుమలశెట్టి, విజయ్ తిరుమలశెట్టి, సాయి శ్రీనివాస్, శివ రామిశెట్టి, వేమూరి నాగేశ్వరావు, బాల నల్లి, నాగేంద్ర సోలంకల, శివ ఘంటా, శివ యెగతీల, చంద్రశ్వేత యర్రంశెట్టి, సౌమ్య కాసర్ల, శ్రీవదన వజ్రాల, హేమరాజ్ గెల్లి, సందీప్ కుమార్ రెడ్డి కొప్పుల, కోటేష్ కంకిపాటి తదితరులు పాల్గొన్నారు మరియు బర్మింగ్హామ్ సిటీలో అచ్యుతరాజు కూర్మపు మీటప్ నిర్వహించటం జరిగింది.