యూకే రిటర్న్స్‌.. మేడ్చల్‌ మల్కాజ్‌గిరికి చెందిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

యూకే నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఇప్పటికే యూకే నుంచి వచ్చిన పలువురికి కొవిడ్‌ నిర్ధారణ కావడంతో వారిని ప్రత్యేకంగా సంస్థాగత క్వారంటైన్‌లో ఉంచారు. తాజాగా యూకే నుంచి వచ్చిన మేడ్చల్‌ మల్కాజ్‌గిరికి చెందిన ఇద్దరికి కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు యూకే నుంచి వచ్చిన వారిలో మొత్తం 18 మందికి కరోనా సోకింది. వీరితో కాంటాక్ట్‌ అయిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలారని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. జీనోమ్ సీక్వెన్స్ కోసం సీసీఎంబీకి శాంపిల్స్‌ పంపించామని చెప్పారు. మరో రెండు రోజుల్లో ఫలితాలు వస్తామని పేర్కొన్నారు. యూకే నుంచి వచ్చిన వారిలో 92 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉండారని, ఆయా రాష్ట్రాలకు సమాచారం అందించామని చెప్పారు. మరో 184 మంది వివరాలు సరిగాలేవని, ట్రేస్‌ చేస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు.