బనగానపల్లె జనసేన ఆధ్వర్యంలో జగనన్న ఇళ్లు పేదలకు కన్నీళ్లు

బనగానపల్లె: జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్లు కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నిర్మించి ఇస్తున్న ఇల్లు ఎక్కడ పూర్తిస్థాయిలో నిర్మాణాలు కాకపోవడంతో వాటిని పరిశీలించి నిరసన తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా బనగానపల్లె పట్టణంలో జనసేన పార్టీ నాయకులు భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ అన్నిచోట్ల కనీసం పునాదులైన పడ్డాయని బనగానపల్లె పట్టణంలో నిర్మాణాలు ఇంకా చేపట్టలేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇల్లు నిర్మిస్తానని చెప్పారని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు నిర్మాణం చేపట్టకపోవడం శోచనీయమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు తన అనుచరులతో కోర్టులో కేసు వేయించి నిర్మాణాలు చేపట్టకుండా చేశారని స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు అంటున్నారని కానీ గట్టి కౌంటర్ ఇచ్చి నిర్మాణాల చేపట్టే దిశగా ముందుకు అడుగులు వేయకపోతున్నారని బనగానపల్లె పట్టణంలో ఉన్న వందల మందికి సొంత ఇల్లు లేదని సొంత ఇల్లు కలగా మిగిలిపోవడం బాధాకరమని ఇప్పటికైనా ఇల్లు నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రత్యామ్నాయం చూపకుండా మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారు కోర్టులో కేసులు వేయడం సమంజసం కాదని స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు త్వరగా నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకొని మిగిలిన రెండు సంవత్సరాలలోనైనా పూర్తి చేసి గతంలో ఏదైతే హామీ ఇచ్చారో నవరత్నాల్లో భాగంగా పేదలకు ఉచిత ఇల్లు అని కచ్చితంగా అమలు చేయాలని అన్నారు. పట్టణంలోని ఎస్ఆర్బిసి కాల్వ పక్కన ఉన్న స్థలాన్ని పరిశీలించి జనసేన పార్టీ తరఫున నిరసన తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొలిమిగుండ్ల మండల నాయకులు పెద్దయ్య, పృద్వి, అవుకు మండల నాయకులు అజిత్ రెడ్డి, జనార్ధన్ జనసైనికులు కిరణ్ రెడ్డి, అల్లాబకాష్, సందీప్, కిట్టు, మద్దిలేటి, రామాంజి, భాష తదితరులు పాల్గొన్నారు.