అరికేరి జీవన్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ కు ఘన నివాళి

శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆరికేరి జీవన్ కుమార్ మాట్లాడుతూ “భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 1891లో ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అంబవాడేలో తల్లిదండ్రులు.. రాంజీ మలోజీ సాక్వాల్, భీమాబాయ్‌లకు జన్మించారు. అంబేద్కర్ ఎన్నో అవమానాలు ఎదుర్కొని సమాజంలో వర్ణ, వర్గభేదాలు ఉండొద్దని రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా రూపొందించి ఎందరికో ఆరాధ్యుడయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదు.. అందరివాడు, రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు కావాల్సిన అవసరాలను, హక్కులను కల్పించిన గొప్ప మహా నాయకుడు. అలాంటి గొప్ప నాయకుడు డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయ సాధనకు జనసేన పార్టీ కృషి చేస్తోంది అని తెలిపారు.” ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ అనంతపురం జిల్లా కార్యనిర్వహన కమిటి సభ్యుడు అమిర్ సోహిల్, వీరమహిళ విజయ, గుంతకల్లు నియోజికవర్గం నాయకులు వీరేష్, గోపి, రవి, మహేష్, రాజు కుమార్, ఏలి, రాజు, గిరి తదితరులు పాల్గొన్నారు.