ముసుగు తీసేసుకున్న ముద్రగడ

  • పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు

గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం అంటే నాకు ఎంతో అభిమానం. నా చిన్నతనంలో కాపు రిజర్వేషన్ పోరాటంలో భాగంగా ముద్రగడ గారు సైకిల్ యాత్రతో మా ఊరికి వచ్చినప్పుడు ఆయనతో కలిసి మచిలీపట్నం వరకు సైకిల్ యాత్ర చేశాం. ఖాళీ పళ్లెం గరిటతో కొట్టి నిరసన తెలుపమంటే తెలిపాం. తుని సభను స్వాగతించాం.మీ మీద దాడి జరిగినప్పుడు బాధపడ్డాం. కానీ సుదీర్ఘ మీ ఉద్యమం తాలూకు ఆకాంక్ష నెరవేరక ముందే కాపులను నెట్టేట ముంచేసి కాపు ఉద్యమం నుంచి తప్పుకున్నప్పుడు పెద్దాయన ఇప్పటివరకు చేసి అలసిపోయి ఉంటారులే అని సరిపెట్టుకున్నాం. ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి మీరు రాసిన లేఖ చూసిన తర్వాత మీరంటే అసహ్యం కలుగుతుంది. కాపు ఉద్యమాన్ని ముద్రగడ తాకట్టు పెట్టాడు అని అనేకమంది అంటున్నా నమ్మలేదు. కానీ ఇప్పుడు నమ్మాలి అనిపిస్తుంది. ఉద్యమ ఆకాంక్ష నెరవేరకుండా ఆపేసిన ఏ రోజు తప్పుగా ప్రచారం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారిని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అసభ్య పదజాలాలతో తిట్ల దండకం ఎత్తుకున్న రోజున మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి రాసినట్లు ఆరోజు ద్వారంపూడికి ఎందుకు లేఖ రాయలేదు.?. ద్వారంపూడి అవినీతిని దుర్మార్గాలను ఎండగట్టినప్పుడు జనసేన పార్టీ ఆడపడుచులను, కార్యకర్తలను ద్వారంపూడి గుండాలు బాహాటంగా కొట్టినప్పుడు తమరు ఎందుకు ఖండించలేదు?. గతంలో మీరు ఎప్పుడు, ఏ సభలోను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గానీ, అతని కుటుంబ సభ్యులు గాని కాపు ఉద్యమానికి సహాయం చేసినట్లు వెల్లడించలేదు. అసందర్భోచితంగా ఇప్పుడు వెల్లడించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో విజ్ఞులు మీరే చెప్పాలి. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే తమరి ముదర తెలివితేటలు ఇప్పటి యువకులకు చూపించకండి. పవన్ కళ్యాణ్ గారి మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మార్చగల ఏకైక సమర్థవంతమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ప్రజాహితం, జనహితం అన్ని వర్గాల సమ్మతితో పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతారు అనేది మా మా ప్రగాఢ నమ్మకం. అపార రాజకీయ అనుభవం, సుదీర్ఘ కాల ఉద్యమ స్ఫూర్తి మీలో ఉంటే దయచేసి రాజకీయ అజ్ఞానిలా ప్రవర్తించి, రాజ్యాధికార దిశగా అడుగులు వేస్తున్న శుభ తరుణంలో మీ పాలేరు తనం తాలూకు భావజాలాలను మాపై రుద్దకండి. మీరు మరింత దిగజారి మిమ్ములను బాహాటంగా విమర్శలు చేసే అవకాశం ఇవ్వకండి అంటూ పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు పేర్కొన్నారు.