ఏర్పేడు మండలంలో జనసేన-పల్లెబాట

శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఆదేశాల మేరకు ఏర్పేడు మండల పరిధిలోని పంచాయతీలలోని గ్రామాల్లోని ప్రజల సమస్యల పరిష్కారం మరియు పార్టీ బలోపేతం దిశగా ప్రారంభించిన జనసేన-పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం తేదిన ఏర్పేడు మండలంలోని మర్రిమంద గ్రామంలో పర్యటించడం జరిగింది. అక్కడి ప్రజలకు పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను, లక్ష్యాలను, గుర్తును తెలియజేసి మరియు వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం మరియు పరి‍ష్కారం కోసం జనసేన ప్రయత్నం చేస్తుందని భరోసా ఇవ్వడం జరిగింది.
ఈ క్రింది సమస్యలను ప్రజలు మా దృష్టికి తీసుకుని రావడం జరిగింది.

  1. నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్, పెట్రోల్, ఆర్టీసీ చార్జీలు పెరుగుదలవలన వారికి ఇచ్చే పథకాలు వలన ప్రయోజనం లేదు అని, వస్తువులు దరలు తగ్గించే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలని మనవి చేశారు.
  2. ఇంటి ముందర రోడ్డు సరిగా లేని కారణంగా ఇబ్బందులు ఎవ్వరికి చెప్పిన స్పంందించని పరిస్థితి.
  3. పేదలు కట్టుకున్న ఇంటికి ప్రభుత్వం ఇస్తామన్న పైకం చెల్లించని పరి‍స్థితులు.
  4. ఇళ్ళు లేనివారికి వారు అప్లై చేసిన ఇవ్వని పరిస్థితులు.
  5. ప్రజల మాట, ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన మా బ్రతుకులు మారని పరిస్థితి అని బ్రతుకులు భారమౌతున్నాయని నిరుత్సాహం.
  6. వృద్ధాప్య పింఛన్లు లకు అర్హత వున్నా పొందలేని పరిస్థితి. ఈ కార్యక్రమంలో జనసేన ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ రామిశెట్టి, ఉపాధ్యక్షుడు లోకనాధం రాయల్, మండల ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ, మండల ప్రథాన కార్యదర్శి ముని శేఖర్, మండల సెక్రటరీ భాను,జనసేన నాయకులు ఈశ్వర్, మోహన్, వంశీ మరియు జనసైనికులు పాల్గొన్నారు.