చిలకలూరిపేటలో జనసేన జెండా ఆవిష్కరణ

చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పెంటేల బాలాజీ ఆధ్వర్యంలో గణపవరం గ్రామంలోని 3వ వార్డ్ రాజీవగాంధీ కాలనీలో సీనియర్ ఎస్సి నాయకులు ముద్దా యోబు చేత జెండా ఎగురవేయించిన బాలాజీ మరియు 1వ వార్డు అంబేద్కర్ కాలనీలో అంబేద్కర్ యూత్ రాజా ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరిండండం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు బాలాజికి హారతి పట్టి స్వాగతం పలికారు, రైతులు ఉత్సాహంగా ట్రాక్టర్లకు జనసేన జెండాలు కట్టి ఊరేగింపుగా వేలాది మందిగా పాల్గొని బాలాజీకి బ్రహ్మరధం పట్టారు. బాలాజీ మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గం వైస్సార్సీపీ కంచుకోట అయిన హరిజన వాడల్లో మొట్ట మొదటిగా జనసేన జెండాలు రావటంతో జనసేన పార్టీనీ పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని బాలాజీ అన్నారు, వైస్సార్సీపీ పాలన ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన సబ్ ప్లాన్ నిధులను ఏ విధంగా దారిమల్లించి వారిని మోసగించి ఏ విధంగా వారిని ఓటు బ్యాంకుగా వినియోగించుకుని మోసం చేస్తున్నారో ప్రజలు తెలుసుకుని వైసీపీ పార్టీని వీడి జనసేన వైపు చూస్తున్నారని పెంటేల బాలాజీ అన్నారు. జనసేన టీడీపీ ఉమ్మడిగా అధికారం వచ్చాక ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పధకాలతో పాటుగా రాష్ట్రాభివృద్ధితో పాటుగా ప్రతి నియోజకవర్గంలోని నిరుద్యోగులను 100 మందికి 10 లక్షలు అంధించి వారిని పారిశ్రామికులాగా తయారు చేస్తామని, గ్యాస్ 500 లకే అందిస్తామని, రేషన్ బియ్యం బదులుగా మహిళలు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని తెలియచేసారు, రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియా ప్రజలకు చేరకుండానే 10 రూపాయలకు కొని 30 రూపాయలకు ఇతర దేశాలకు ఎగుమతి చేయటంలో చిలకలూరిపేట మంత్రి విడదల రజని మొదటి స్థానంలో ఉన్నారని, నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రానైట్ క్వారిల్లు మధ్యంపై అక్రమ సంపాదనతో మంత్రి దండుకుంటున్నారని, ఊరి మధ్యలో ఉన్న హరిజన వాడలను ఊరుకి 4 కిలోమీటర్లు దూరంలో ఇంటి పునాదులు కూడా నిలువని సౌడు భూముల్లో కేటాయించారని, త్రాగునిరు కూడా మురికిగా వస్తున్నాయని ప్రజలు బాలాజీకి మోరపెట్టుకున్నారు. రాబోయేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అని అందరికీ సమానత్వం వచ్చేలా పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని, ఆ ఏసుప్రభు సాక్షిగా భరోసా ఇస్తున్నామని బాలాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గణపవరం గ్రామ టీడీపీ నాయకులు ఫ్లోర్ లీడర్ గంగా శ్రీను పాల్గొని అధికార పార్టీ అవినీతి ఎండగడుతూ రాబోవు ఎన్నికలలో జనసేన – తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడేలా ప్రజలు అందరు ఓటు రూపంలో బలంగా చూపించాలని కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నాయకులు బాలాజీ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ జెనరల్ సెక్రటరీ కొణిదెల నాగబాబు పుట్టినరోజు పురస్కరించుకొని 2000 మంది ప్రజలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలియచేసారు. ప్రజల తరుపున మరియు చిలకలూరిపేట జనసేన పార్టీ తరుపున శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ జెండా కార్యక్రమం నాగబాబు పుట్టినరోజు కానుకగా అందిస్తున్నామని తెలియచేసారు. గణపవరం గ్రామ ప్రజలు సంతోషంతో జనసేన తెలుగుదేశం పొత్తుకి సహకరిస్తాం అని నినాదలు చేసారు.