అమీనాబాద్ లో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

రంపచోడవరం నియోజకవర్గం: రాజవొమ్మంగి మండలం, అమీనాబాద్ పంచాయతీ పరిదిలోని అమీనాబాద్ కాలనీలో బుధవారం జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ నెమలిపురి వీరేందర్ రెడ్డి సహకారంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. 2024లో ఎలక్షన్ జనసేన టిడిపి పార్టీలు విజయకేతన నమోదు చేస్తాయని ప్రతి ఒక్కరు కష్టపడాలని పనిచేయాలని సందర్భంగా ప్రతి ఒక్కరూ వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుంకర కృష్ణవేణి, రంపచోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షులు కుర్ల రాజశేఖర్ రెడ్డి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు కాకి స్వామి, తెలుగుదేశం పార్టీ రంపచోడవరం నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, రంపచోడవరం మండల అధ్యక్షులు శ్రీనివాసరావు, రాజవొమ్మంగి మండలం అధ్యక్షులు బొద్దిరెడ్డి త్రిమూర్తులు, అడ్డతీగల మండలం జనసేన పార్టీ మండల నాయకులు కుప్పాల జయరాం, మారేడుమిల్లి మండలం అధ్యక్షులు మల్ల దుర్గా ప్రసాద్, గంగవరం మండలం అధ్యక్షులు కుంజం సిద్దు, దేవీపట్నం మండలం అధ్యక్షులు సారపు వెంకటరాయుడు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.