గిరిజ‌న‌ సంపదను దోచుకోవడానికే జిల్లాల విభజనా?: వంపూరు గంగుల‌య్య‌

అల్లూరి సీతారామ‌రాజు జిల్లా, పాడేరు: ఈ ఏడాదిలో సాధించిన ప్రగతి ఏమిటి?.. గిరిజ‌న‌ సంపదను దోచుకోవడానికే జిల్లాల విభజనా?.. అంటూ జనసేన అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ వంపూరు గంగుల‌య్య‌ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. జిల్లాల ప్రకటించి ఏడాది అయిన సందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ పరిపాలన‌ సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని 26 జిల్లాలు చేశారు, కానీ అభివృద్ధి మాత్రం న‌త్త‌కు మించి ఉంద‌ని గంగులయ్య అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రగతి ఏంటో తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన సంపాదను దోచుకోవడానికి అల్లూరు జిల్లా ఏర్పాటు చేశారా? అని ఆయన ప్రశ్నించారు. జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధి పల్లె ప‌ల్లెలోనూ… గడపగడపకు చూడచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేసినప్పుడు చాలా ఆనందమ‌నిపించింద‌ని …. కానీ నేటి పరిస్థితులు చూస్తే భాదేస్తుందని ఆయన ఆవేద‌న వ్యక్తం చేశారు. ఈరోజు ఎస్టీలకు జరుగుతున్న అన్యాయం చూస్తుంటే కేవలం ఇక్క‌డ ఆదివాసీ సంపదను దోచుకోవాల‌ని, అడవి తల్లి ధ్వంసం చేయాల‌నే కొత్త జిల్లా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుందని ఆయన అన్నారు.

ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో చెప్పండి.. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడ యువతకు ఉపాధి లభించాలంటే కచ్చితంగా పారిశ్రామిక అభివృద్ధి జరగాలనే జగమెరిగిన సత్యమ‌ని గంగుల‌య్య‌ అన్నారు కానీ జిల్లా ఏర్పడి ఏడాది పూర్తయినా సరే ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాకపోవడం విచార‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు ఇక్కడ యువతను ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చేసినటువంటి ఒక్క మంచి పనినైనా తెలియజేయాలని డిమాండ్ చేశారు . గతంలో విశాఖపట్నంలో అల్లూరి జిల్లా ఉండేటప్పుడు ఈ ప్రాంతం వాళ్లు గవర్నమెంట్ ఉద్యోగం పరంగా అయినా ప్రైవేటు ఉద్యోగం పరంగా అయినా సరే బాగా అభివృద్ధి చెందిన పారిశ్రామిక నగరమైనటువంటి విశాఖపట్నంలో అవకాశాలు పొందే వారిని చెప్పారు. రిజ‌ర్వేష‌న్లు ప‌రంగా విశాఖ‌కు మ‌నం స్థానికులుగా ప‌రిగ‌ణించేవార‌ని నేడు స్థానికేత‌రులమయ్యామ‌ని చెప్పారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే జిల్లాల విభజన చేయనక్కర్లేదని అభివృద్ధి చేసే ఆలోచనలు ఉంటే బాగుండున‌ని ఆయ‌న సూచించారు. అభివృద్ధిని చేయ‌డం చేత‌కాక జిల్లాల విభజన పేరుతో నెలరోజులపాటు పండగలు చేసుకున్నారే గాని రూపాయి కూడా అద‌నంగా ఈ జిల్లాకు ఖర్చు చేసింది లేదని ఆయన పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే అల్లూరి సీతారామరాజు జిల్లాకు చేసిన మేలు ఏంటో వివరించాలని సవాల్ విసిరారు..

గ‌నులు తవ్వుకోవడానికి, హైడ్రో పవర్ ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి జిల్లా చేశారా?.. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా గిరిజన సంపాదన దోచుకోవాలని వైసీపీ ప్ర‌భుత్వం ఎత్తుగడవేసిందని గంగులయ్య అన్నారు. మైదాన ప్రాంత గిరిజనుడిని త‌న ఏజెంట్‌గా పెట్టుకొని నిజ‌మైన గిరిజ‌నుల వ‌ద్ద దందా చేద్దామ‌ని వేసిన స్కెచ్ విజ‌య‌వంత‌మైంద‌ని ఆయన చెప్పారు. అందుకే గిరిజ‌న చ‌ట్టాల‌ను ఉల్లంఘించి కూడా ఇక్క‌డ కాల్సైట్ గ‌నుల‌ను త్వ‌వ్వొకొని వెళ్ళిపోతున్నార‌ని గంగుల‌య్య తెలిపారు. ఇది స‌రికాద‌ని చెప్పిన స్థానికుల‌ను ఏపీఎండీసీ నుంచి ఉద్యోగం నుంచి తొల‌గించి గిరిజ‌న బిడ్డ‌కు అన్యాయం చేశార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇవ‌న్నీ చూస్తుంటే భ‌విష్య‌త్‌లో అల్లూరి జిల్లా జ‌గ‌న్ రెడ్డి కబంధ హ‌స్తాల్లోకి వెళ్లిపోతుంద‌ని ఆయ‌న అన్నారు. దానిలో భాగంగా సీఎం సొంత జిల్లాకు చెందిన శ్రీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి ఎర్రవరంలో హైడ్రోపవర్ ప్రాజెక్టును కట్టబెట్టారని దానివల్ల గిరిజనులు ఉపాధి లేకపోగా సుమారుగా 32 గ్రామాల వారు నిర్వాసితులైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తెచ్చినా ఆ ప్రాజెక్టులు ఆపడానికి మాత్రం సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డం లేదు. దీంతో అనంత‌గిరి మండలంలో అదానీకి మ‌రో మూడు హైడ్రో ప‌వ‌ర్ ప్రాజెక్టుల నిర్మాణానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇలా ఇష్టానుసారంగా గిరిజ‌న సంప‌ద‌ను దోచుకోవాడానికి కొత్త ఏర్పాటు చేసిన సులువుగా ప‌ని చేసుకుంటోందీ వైసీపీ ప్ర‌భుత్వం.

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ను మూసేసి జిల్లా ప్రకటిస్తే లాభమేమిటి?..
గిరిజన విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా, దుర్మార్గంగా మూసివేస్తుందని జనసేన నేత డాక్టర్ వంపూరు గంగులయ్య ఆరోపించారు. గతంలో మూడు నుంచి 10వ తరగతి వరకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో ప్రవేశాలు జరిగేవని ఈ సంవత్సరం ప‌దో త‌ర‌గ‌తికి మాత్రమే ప్రవేశాలు జరిపారని అంటే వచ్చే సంవత్సరం నుంచి ఆ పాఠశాలను మూర్చవేతను ఈ ప్రభుత్వమే ఖరారు చేసిందని చెప్పారు. ఇప్పటికీ గిరిజనులకు విద్య అందరిని ద్రాక్షగానే మిగిలిపోయింద‌ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

శిశు మరణాలను ఆపగలిగారా?..
ఇప్పటివరకు గిరిజన ప్రాంతంలో 1800 మందికి పైగా శిశువులు మృతి చెందారని, ఈ ఏడాది కాలంలో చూసుకుంటే ఆ మృతుల సంఖ్య భారీగా పెరిగిందని గంగుల‌య్య ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగానే ప్రభుత్వం ఆలోచించినట్లు జిల్లా హెడ్ క్వార్టర్ ఎక్కడైనా అధికారులందరూ ఇక్కడే ఉన్నా వాళ్ళు నిజంగానే పనిచేస్తున్నారు అనుకుంటే ఈ మరణాలు ఎందుకు జరుగుతున్నాయని నిలదీశారు. ప్రత్యేక జిల్లా ఏర్పడడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో డోలుమూతలు ఆగాయా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికీ గిరిజన ప్రాంతంలో సుమారుగా 1200 గ్రామాలకు రహదారి సదుపాయం లేదని మీ ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింద‌ని పేర్కొన్నారు. జిల్లా కొత్తగా ఏర్పడడం వల్ల ఈ గ్రామాలకు ఏమైనా కనెక్టివిటీ ఏర్పడిందా? అన్న విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని కోరారు. జిల్లాల ఏర్పాటు ప్రధానం కాకుండా పల్లె పల్లెకి, గడప గడపలోనూ అభివృద్ధి చేయాలని ఆకాంక్ష ప్రభుత్వానికి వచ్చినప్పుడే గిరిజనులకు మేలు జరుగుతుందని ఆ దిశగా ఉన్న ప్రభుత్వాలని ప్రజలు తమ ఓటుతో ఎన్నుకోవాలని ఆయన కోరారు.