నారాయణపురంలో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

పార్వతీపురం నియోజకవర్గం: బలిజిపేట మండలం, నారాయణపురం గ్రామంలో ఆ గ్రామ‌ నాయకుల ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ మరియు పార్టీలో చేరికలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, బొబ్బిలి టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బేబీ నాయన, చీపురుపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి విసినిగిరి శ్రీనివాసరావు, జనసేన మరియు టిడిపి మండల అధ్యక్షులు మరియు నాయకులు పాల్గొనడం జరిగింది. వైసిపి పార్టీ నుంచి పైల ప్రసాద్ రావు గారు మరియు మరో 30 కుటుంబాల సభ్యులు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శులు గంటేడ స్వామి నాయుడు, చిట్లి గణేష్, మండల అధ్యక్షులు బంకురు పోలినాయుడు, ఆగూరు మణి, సంచాన గంగాధర్, రఘు మండల అప్పలనాయుడు, కోట్ల పకీర్ నాయుడు, జనార్ధన్ నాయుడు, కోట్ల శివ, గుంట్రెడ్డి గౌరీ శంకర్, సాలీల రవీంద్ర, ప్రగడ కళ్యాణ్, పాలూరు వెంకటేష్, పరుచూరి రమణ, పోతల శివశంకర్, బొండాడ గణేష్, మామిడి సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.