UPSE IES/ISS Notification 2021: కేంద్ర ఆర్ధికశాఖలో ఉన్నతోద్యోగాల భర్తీ

UPSE IES/ISS Notification 2021: నిరుద్యోగులకు శుభవార్త. యూపీఎస్సీ ఐఈఎస్, ఐఎస్ఎస్ నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీ కోసం వెలువడిన నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.

యూపీఎస్సీ(UPSC) ప్రతియేటా ఐఈఎస్, ఐఎస్ఎస్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంటుంది. ఇందులో భాగంగా ఈసారి UPSC IES/ISS-2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో కేంద్ర ఆర్ధిక మంత్విత్వ శాఖ, అనుబంధ విభాగాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాల భర్తీకై షెడ్యూల్ ఉంది. ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.

మొత్తం పోస్టులు: 26

ఐఈఎస్ కేటగరీలో 15 ఉన్నత స్థాయి పోస్టులు

 ఐఎస్ఎస్ కేటగరీలో 11 ఉన్నత స్థాయి పోస్టులు

అర్హతలు, ఎంపిక విధానం వివరాలు:

విద్యార్హత: ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ కోసం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌ లేదా అప్లయిడ్‌ ఎకనామిక్స్‌ లేదా బిజినెస్‌ ఎకనామిక్స్‌ లేదా ఎకనోమెట్రిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణత ఉండాలి. ఇక ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌ కోసం స్టాటిస్టిక్స్‌ లేదా మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌ లేదా అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్‌ డిగ్రీ లేదా ఆయా సబ్జెక్టుల్లోని ఒకదానిలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

ఈ రెండింటికీ వయసు: 2021 ఆగస్టు 1 నాటికి 21-30ఏళ్ల మధ్య ఉండాలి. 1991 ఆగస్టు 2 నుంచి 2000 ఆగస్టు 1 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది.

ఎంపిక విధానం:  రాత పరీక్ష, వైవా వాయిస్‌లో ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రాత పరీక్షకు 1000 మార్కులు, వైవా వాయిస్‌కు 200 మార్కులు కేటాయించారు. ఆఫ్‌లైన్‌లో విధానంలో పరీక్ష జరుగుతుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని వైవా వాయిస్‌కు పిలుస్తారు. మొత్తంగా 1200 మార్కులకు అభ్యర్థులు సాధించిన స్కోర్‌ ఆధారంగా, రిజర్వేషన్లను అనుసరించి తుది ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 27 వతేదీ 2021

దరఖాస్తు ఫీజు: 200 ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది

జూలై 16 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం https://www.upsconline.nic.in సంప్రదించాల్సి ఉంటుంది.