ఊరు-వాడ జనసేన పార్టీ

మంత్రాలయం నియోజకవర్గం, కౌతాళం మండలం పరిధిలోని వివిధ గ్రామాల జనసైనికులతో మంత్రాలయం నియోజకవర్గ జనసేన నాయకులు పొంత నరసింహులు ఆధ్వర్యంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో త్వరలో జనసేన పార్టీ తరపున జరుపబోవు “ఊరు-వాడ జనసేన పార్టీ” కార్యక్రమం గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఊరిలో జనసేన పార్టీ సిద్ధాంతాలను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, పవన్ కళ్యాణ్ చేపట్టబోయే అంశాలను ప్రతి గ్రామంలో ప్రజలకు వివరించాలని ఈ సమావేశంలో చర్చించడం జరిగింది.