రాబోయే ఎన్నికల్లో వెలమసంఘం పూర్తి మద్దతు జనసేన పార్టీకే: దాసరి బలరాం

  • వెలమ సంఘం అత్మీయసమావేశం

పాలకొండ: అనకాపల్లి జిల్లాలో మే 28వ తేది ఆదివారం రాష్ట్ర వెలమ సంఘం అత్మీయసమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన వారికి విందుభోజనం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర వెలమసంఘం నాయకులు మరియు అఖిలభారత బిసి సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి బలరాం సమావేశంలో మాట్లాడుతూ. ఉత్తరాంధ్ర వెలమసంఘం రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి పూర్తి మద్దతు ఇస్తుందని, పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర వెలమసంఘం నాయకులు పూర్తి మద్దతు ఇచ్చి జనసేనపార్టీ బలోపేతం చేయాలని వెలమసంఘం నాయకులుకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హాజరైన వెలమసంఘం నాయకులు పైల నర్సంగరావు, రాయవరపు సూర్యనారాయణ, కచిరెడ్డి సత్తిబాబు, కటారినాయుడు, సింగంపల్లి వాసు, వాసిరెడ్డి బాలకృష్ణా, గాడి చిన్న, రెడ్డి శివరామినాయుడు, సింగిరెడ్డి సతీష్, లాలం గణేష, పైల రామారావు తదితరులు పాల్గొన్నారు.