ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న వబ్బిన

శృంగవరపుకోట నియోజకవర్గం: లక్కవరపుకోట మండలం, లక్కవరపుకోట గ్రామంలో జనసేన పార్టీ ఆదేశాల మేరకు ఓటర్ నమోదు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ వాటర్ నమోదు కార్యక్రమంలో జనసేన పార్టీ శృంగరపుకోట నియోజకవర్గ సమన్వయకర్త వబ్బిన సత్యనారాయణ పాల్గొనడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో లక్కవరపుకోట మండల నాయకులు షేక్ ఫిరోజ్ మరియు కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో చాలా కొత్త ఓటర్స్ ని అప్లై చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జనసైనికులు బుల్లి, రఘు, నరేంద్ర, మహేష్ కోటి, దేవేంద్ర, ఇస్మాయిల్ సతీష్, గణేష్, సంతోష్, దాస్, జనసైనికులు పాల్గొన్నారు.