నేడు ప్రధాని చేతుల మీదుగా వ్యాక్సినేషన్ ప్రారంభం..

దేశవ్యాప్తంగా నేడు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారితో అల్లాడిపోయిన దేశానికి నేటి నుంచి సాంత్వన లభించనుంది. వైరస్‌పై పోరు కోసం సిద్ధమైన టీకా పంపిణీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణలో తొలి రోజు 140 కేంద్రాలలో వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నారు. ఒక్కో కేంద్రంలో 30 మందికి మించకుండా తొలిరోజు 4,170 మంది టీకా వేస్తారు.

అంతకంటే ముందు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గాంధీ ఆసుపత్రి, నార్సింగిలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, టీకా లబ్ధిదారులతో మాట్లాడతారు. అలాగే, మిగతా 138 కేంద్రాల్లోనూ ప్రధాని ప్రసంగం వినిపించనున్నారు.