వ్యాక్సినేషన్ 100 కోట్ల మార్కు గర్వకారణం: జనసేనాని

ఇంతింతై వటుడింతై అన్నట్టుగా
కరోనాపై పోరాటంలో దేశం మైలురాయిని అధిగమించింది. .. 100 కోట్ల డోసుల్ని దేశం దాటేసింది. ఎన్నో అవాంతరాలను దాటుకుని వాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ఈ ఘనతకు కారకులైన ప్రధాన మంత్రి మోడీకి ధన్యవాదాలు అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ మేరకు పవన్ వీడియో విడుదల చేశారు. కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ 100 కోట్ల డోసుల మార్క్ దాటడం ప్రతి ఒక్కరం హర్షించాల్సిన మైలు రాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ విజయం సాధించడం గర్వకారణం. గడచిన ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్నే కాకుండా భారతదేశాన్ని కూడా ఓ కుదుపు కుదిపేసింది.లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక దశలో డబ్ల్యూహెచ్ఓ దగ్గర నుంచి వైద్య నిపుణులు ప్రతి ఒక్కరూ భారతదేశంలో కోట్లాది మంది చనిపోతారనీ, ఆర్ధికవ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని రకరకాల ఊహాగానాలు చేశారు. వీటన్నింటినీ దాటుకుని వాక్సినేషన్ ప్రక్రియ 100 కోట్ల మార్క్ దాటింది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖలోని హెల్త్ వర్కర్స్, వైద్యులు, వైరాలజిస్టులు, ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు అన్నారు పవన్.